ఆకాశంలో మిల మిల మెరిసే తారకలాగా తళుక్కున మెరవాలని ఉంది!
చందమామనై చల్లని కాంతులు వెదజల్లాలని ఉంది!!
లోకబాంధవుడు సూర్యుడిలా లోకాలన్నీ యేలాలని ఉంది!
శ్రావణ మేఘపు జల్లుగ కురిసి పుడమి తల్లిని తడపాలని ఉంది!!
వసంత మాసాన ప్రకృతినై పులకించాలని ఉంది!
ఎల కోయిలనై కుహు కుహు మని కూయాలని ఉంది!!
అందాలొలికే గులాబి బాలగ వికసించాలని ఉంది!
ఝుమ్మని ఎగిరే తుమ్మెదనై అందలి మకరందం గ్రోలాలని ఉంది!!
జల జల పారే సెలయేరై కొండలు కోనలు చూడాలని ఉంది!
చల్లగ వీచే పిల్లగాలినై శ్రామికులని సేద తీర్చాలని ఉంది!!
మండుటెండలో సైతం నిండుగా నిలిచి నీడనిచ్చే తరువునై నిలవాలని ఉంది!!!
మధుర గాయకుని గళం పలికే మధురమైన గానమునై వీనులవిందులు చేయాలని ఉంది!
నర్తకీమణి కాలి మువ్వనై ఘల్లుఘల్లున నర్తించాలని ఉంది!!
కవి సార్వభౌముని కావ్యాన్నై కలకాలం మిగలాలని ఉంది!!!
ఇవేవీ తీరే కోర్కెలు కావని తెలుసు!
అయినా ఆగదు పిచ్చి మనసు!!
తీరని కోర్కెలు కోరడమే దానికి తెలుసు!!!
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
బాగుంది మీ కవిత... బ్లాగ్లోకానికి స్వాగతం....
శ్రీలేఖ, బ్లాగ్ ప్రపంచానికి స్వాగతం. బాగుంది మీ కోర్కెలు.
nice dreams
bollojubaba
బ్లాగ్లోకానికి స్వాగతం... కవిత బావుంది...
@ప్రపుల్లచంద్ర గారు, చైతన్య గారు, బాబా గారు, మేధ గారు : నా బ్లాగ్ చదివినందుకు, కవిత నచ్చినందుకు కృతజ్ఞతలు..
Post a Comment