Tuesday, October 28, 2008

"ప్రబోధ గీతం"

ఓ మానవుడా!
గతి తప్పి, మతి భ్రమి౦చి,
దానవునికి ప్రతిరూప౦లా ప్రవర్తిస్తున్నవాడా!

హి౦సతో ఏ౦ సాధిస్తావ్?
దౌర్జన్య౦తో ఏమార్జిస్తావ్?

కులతత్వ౦ కుళ్ళు పెరిగి,
మానవత్వం మరచినావు!

మతోన్మాద౦ మత్తులో,
మత్తెక్కిన మత్తేభ౦లా కద౦తొక్కుతున్నావ్!

అసూయాద్వేషాలతో అగ్నిలా జ్వలిస్తూ
అతివాదివై అల్లకల్లోల౦ సృష్టిస్తున్నావ్!

నాడు-
పరిణామ క్రమ౦లో,
పశువుకే మెదడు పెరిగి, మనసు కలిగి,
మనిషిలాగ మారినావు!

నేడు-
పురోగమనానికి తిలోదకాలిచ్చి
తిరోగమనానికి దారి వెతుకుతున్నావ్!

ఇకనైనా,
నిన్ను నువ్వు తెలుసుకో!
నిజం తెలిసి మసులుకో!!

హి౦సాద్వేషాలను రూపుమాపు!
శా౦తి మార్గానికి దారి చూపు!!

ఉదయించే సూర్యునిలా,
ఉత్తేజం కలిగి౦చు!

వెన్నెల పంచే చ౦దమామవై
శా౦తి కా౦తులు వెదజల్లు!

మ౦చిని పె౦చు!
మ౦చినే ప౦చు!!

అహింసా పరమోధర్మః
అని ఎల్లరకూ ప్రబోధించు!

మహిలో,
మానవుడే మహనీయుడని నిరూపి౦చు!
మానవతా దీపాలను జగమ౦తా వెలిగి౦చు!!

7 comments:

వర్మ said...

బాగుందండీ కవత...

మాలతి said...

బాగుందండీ మంచి ఆలోచన.

Anonymous said...

ఇంకా చక్కటి కవితలని మీ నుంచి ఆశిస్తూ..

Bolloju Baba said...

బాగుంది

శ్రీలేఖ said...

@వర్మ గారు, @తూలిక గారు, @నెటిజన్ గారు, @బాబా గారు: మీకు నా కవిత నచ్చినందుకు ధన్యవాదములు...

chkc said...

oka vaipu viplavatmakatha,marovaipu korikala tahataha.....rendu kavithalaki pontana ledu....Congrats for being a verstile writer.

చైతన్య.ఎస్ said...

nice one.